నాగబాబు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

నాగబాబు జబర్దస్త్ ని వదిలేసి.. అదిరింది ప్రోగ్రాం కి వెళ్లినా అక్కడ కూడా జబర్దస్త్ ని ఎలా చూసుకున్నాడో అలానే అదిరిందికి అన్ని తానై చూసుకుంటున్నాడు. కానీ [more]

Update: 2020-03-19 06:55 GMT

నాగబాబు జబర్దస్త్ ని వదిలేసి.. అదిరింది ప్రోగ్రాం కి వెళ్లినా అక్కడ కూడా జబర్దస్త్ ని ఎలా చూసుకున్నాడో అలానే అదిరిందికి అన్ని తానై చూసుకుంటున్నాడు. కానీ అది మాత్రం వర్కౌట్ అయ్యి జబర్దస్త్ ని దాటడం లేదు. జబర్దస్త్ ముందు ప్రతి వారం అదిరింది షో వెలవెల బోతూనే ఉంది. నాగబాబు ఎన్ని ప్లాన్స్ చేసినా అవి తిరిగి తిరిగి నాగబాబుకే తగులుతున్నాయి. ఆఖరుకి యాంకర్ సమీరా ని మార్చి భాను, రవిలను తీసుకొచ్చిన అదిరింది షో పరిస్థితి అలానే ఉంది. అలాగే అదిరింది షో లో సద్దాం లాంటి కమెడియన్స్ ని తీసుకొచ్చినా అదిరింది లేవడం లేదు, అదరడం లేదు.

ఇక నాగబాబు పక్కన జడ్జ్ స్థానంలో నవదీప్ ఉంటున్నాడు. గత కొన్నివారాలుగా నవదీప్ కో జడ్జ్ గా ఉన్నప్పటికీ… కమెడియన్ నవదీప్ మీదే పంచ్ లు వేసే పరిస్థితి వుంది. అయినా నవదీప్ కూడా ఆహా ఓహో అనడం తప్ప మరేం చేయలేకపోతున్నాడు. ఇక నాగబాబు ఇలా అయితే కుదరదని మరో జడ్జ్ అంటే లేడి జేడ్జ్ అది కూడా ఓ మాజీ హీరోయిన్ ని జడ్జ్ గా తీసుకొస్తే.. పరిస్థితి మెరుగవుతుంది అని భావిస్తున్నాడట. జబర్దస్త్ లో రోజా జర్నీ అందరికి తెలుసు. ప్రస్తుతం రోజా సింగల్ హ్యాండ్ తో షోని లీడ్ చేస్తుంది. సో అదిరింది కూడా ఓ మాజీ హీరోయిన్ ని రోజాని తలదన్నేలా జడ్జ్ గా చేస్తే… అదిరింది కి ఏమైనా న్యాయం చేయగలమని బాబు గారి ప్లాన్ అట. మరి హీరోయిన్స్ జడ్జ్ లుగా ఉంటె షో కి అదనపు ఆకర్షణ అని బాబు గారు ఎప్పుడో ఆలోచించినా.. బడ్జెట్ విషయంలో అప్పట్లో జీ వెనక్కి తగ్గిందట. కానీ బాబు గారు అదిరింది యాజమాన్యాన్ని ఒప్పించినట్లుగా ప్రస్తుత టాక్.

Tags:    

Similar News