హైపర్ ఆది నుండి సినిమా కథ

ప్రస్తుతం జబర్దస్త్ లో బిందాస్ గా దూసుకుపోవడమే కాదు.. తన స్కిట్స్ తో జబర్దస్త్ నే పైకి లేపుతున్న కమెడియన్, రైటర్ హైపర్ ఆది. నాగబాబు జబర్దస్త్ [more]

Update: 2019-12-16 05:40 GMT

ప్రస్తుతం జబర్దస్త్ లో బిందాస్ గా దూసుకుపోవడమే కాదు.. తన స్కిట్స్ తో జబర్దస్త్ నే పైకి లేపుతున్న కమెడియన్, రైటర్ హైపర్ ఆది. నాగబాబు జబర్దస్త్ ని వదలగానే ఆది కూడా నాగబాబు తో పాటుగా వెళ్ళిపోతాడని ప్రచారం జరగడం, ఆది ముందరి కాళ్ళకి మల్లెమాల బంధం వెయ్యడంతో.. ఆది చచ్చినట్టు జబర్దస్త్ లోనే ఉండాల్సి వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఇక నాగబాబు ఉన్నా లేకపోయినా.. హైపర్ ఆది స్కిట్స్ మాత్రం జబర్దస్త్ లో పేలుతూనే ఉన్నాయి. బిటెక్ చదివి ఉద్యోగం చేసుకునే తనకి అదిరే అభి పిలిచి జబర్దస్త్ చేసే అవకాశం ఇచ్చాడని, తర్వాత సెట్స్ లో తాను వేసే డైలాగ్స్ తో తనకి రైటర్ గా ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా.. మంచి స్కిట్స్ రాయటడంతో.. 2018 నుండి టీం లీడర్ గా ప్రమోట్ చేసారని చెబుతున్నాడు ఆది.

అయితే టీం లీడర్ అయ్యాక వెనుదిరిగి చూసుకోలేదని, అయితే జబర్దస్త్ స్కిట్స్ ని పరదేశీ అనే మరో రచయితతో కలిసి రాస్తుంటా అని, కొన్ని సినిమాలకి కామెడీ డైలాగ్స్ కూడా అందించానని చెప్పిన హైపర్ ఆది ఢీ లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ కి కూడా కామెడీ ట్రాక్స్ రాస్తుంటానని చెబుతున్నాడు. అంతేకాకుండా తన నుండి త్వరలోనే ఓ సినిమా కథ వస్తుందని చెబుతున్నాడు. ఇప్పటికే హైపర్ ఆది, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు స్క్రిప్ట్ విషయంలో హెల్ప్ చేస్తున్నాడనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు పూర్తి కథనే తయారు చేసి సినిమాకి ఇవ్వబోతున్నాడన్నమాట.

Tags:    

Similar News