చిరు సినిమాలో జబర్దస్త్ యాంకర్

చిరు 152 చిత్రం ను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కానీ చిరు ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ బిజీగా [more]

Update: 2019-06-08 07:26 GMT

చిరు 152 చిత్రం ను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కానీ చిరు ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ బిజీగా ఉండడంతో ఈసినిమా లేట్ అవుతుంది. సాధారణంగా కొరటాల ఇన్ని నెలలు వెయిట్ చేయడు. ఈ గ్యాప్ లో ఒక సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చేవాడు. కాకపోతే రామ్ చరణ్ తో ఉన్న స్నేహం కారణంగా ఇంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం కొరటాల నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. అటు బుల్లి తెరపై .. మరో వైపున వెండితెరపై ఒక రేంజ్ లో సందడి చేస్తున్న నటి కం యాంకర్ అనసూయ ప్రస్తుతం ‘కథనం’ చిత్రంలో ప్రధాన పాత్రధారిగా చేస్తోంది. ఈచిత్రం కంప్లీట్ అయిందో లేదో వెంటనే ఆమెకు చిరు – కొరటాల సినిమాలో ఆఫర్ వచ్చిపడింది. ఇందులో ఆమెది ఓ ముఖ్య పాత్ర అని తెలుస్తుంది. ఆ పాత్రకు అనసూయ అయితే బాగుంటదని కొరటాల భావించి ఆమెను తీసుకున్నారు అంట.

చిరు పుట్టినరోజున ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరు కి జోడిగా శ్రుతి హాసన్ ను అనుకుంటున్నారు. అనుష్క అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో శ్రుతి వచ్చింది. త్వరలోనే పూర్తి డీటెయిల్స్ తెలియనుంది.

Tags:    

Similar News