అనసూయ అదృష్టం అలా వుంది

అనసూయ జబర్దస్త్ షో తో ఎంతగా పాపులర్ అయ్యిందో… కాంట్రవర్సీలతోను అంతే ఫెమస్ అయ్యింది. ఏదైనా మొహం మీదే చెప్పే అనసూయ కి గ్లామర్ షో చెయ్యాలనే [more]

Update: 2019-11-26 04:54 GMT

అనసూయ జబర్దస్త్ షో తో ఎంతగా పాపులర్ అయ్యిందో… కాంట్రవర్సీలతోను అంతే ఫెమస్ అయ్యింది. ఏదైనా మొహం మీదే చెప్పే అనసూయ కి గ్లామర్ షో చెయ్యాలనే కోరిక బాగావుంది. అందుకే హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని ఊపేసే అనసూయ కి ఇప్పుడు జబర్దస్త్ తో పాటుగా మరో బుల్లితెర జి ఛానల్ కూడా రెడ్ కార్పెట్ పరిచింది. డ్రామా జూనియర్స్ జేడ్జ్ గా జీ ఛానల్ లో ఫెమస్ అయిన అనసూయ ఇప్పుడు లోకల్ గ్యాంగ్స్, ఎన్నెన్నో అనుకుంటామనే ప్రోగ్రాం కి యాంకర్ కం జేడ్జ్ గా కనబడుతుంది. అనసూయ తాజాగా వెండితెర మీద కూడా బాగా బిజీ కాబోతుంది.

రంగస్థలం రంగమ్మత్త పాత్రలో ఇరగదీసిన అనసూయ విన్నర్ లో స్పెషల్ సాంగ్ తోనూ రెచ్చిపోయింది. అయితే రంగస్థలం రంగమ్మత్త పాత్ర చూసి ఇంప్రెస్స్ అయిన దర్శకుడు కృష్ణవంశీ తాను తెరకెక్కించబోయే రంగమార్తాండ సినిమాలో ఓ కీలక పాత్ర ఇవ్వబోతున్నాడట. మరాఠీ చిత్రం నటసామ్రాట్ కి రీమేక్ గా తియ్యబోతున్న సినిమా కోసం కృష్ణవంశీ చెప్పిన కథలో తన పాత్ర కీలకంగా ఉండటంతో వెంటనే అనసూయ ఓకే చెప్పేసిందట. కథనం చిత్రంలో ఓ కీ రోల్ చేసిన అనసూయ కి ఆ సినిమా నిరాశ పరిచినా.. ఇప్పుడు కృష్ణ వంశి పాత్ర ద్వారా పాపులర్ అవుతానని చెబుతుందట. పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందో కానీ కృష్ణవంశీ పిలిచి ఆఫర్ ఇచ్చేసరికి అనసూయ మాత్రం పట్టలేని ఆనందంతో తేలిపోతుందట. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ లు కలిసి నటిస్తున్నారు.

Tags:    

Similar News