అనసూయ.. స్పైసి అంటే ఏమిటి?

జబర్దస్త్ తో యాంకరింగ్ ప్రపంచానికి గ్లామర్ పరిచయం చేసిందే హాట్ యాంకర్ అనసూయ. హీరోయిన్స్ తో పోటీగా అందాలు ఆరబోసిన అనసూయ కి వెండితెర అవకాశాలు తన్నుకుంటూ [more]

Update: 2019-12-18 07:22 GMT

జబర్దస్త్ తో యాంకరింగ్ ప్రపంచానికి గ్లామర్ పరిచయం చేసిందే హాట్ యాంకర్ అనసూయ. హీరోయిన్స్ తో పోటీగా అందాలు ఆరబోసిన అనసూయ కి వెండితెర అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇద్దరి పిల్లల తల్లయినా.. అనసూయ హాట్ అందాలు చూస్తుంటే … హీరోయిన్స్ కి తీసిపోని గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నటీమణి. అయితే అనసూయ కి కావాల్సిన గ్లామర్ పాత్రలు ఇంతవరకు ఆమెకి వెండితెర మీద తగల్లేదనే చెప్పాలి. క్షణం కాని, రంగమ్మత్తగా కానీ.. ఇలా ఆమెకి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు తప్పితే.. గ్లామర్ పాత్రలు రాలేదనే చెప్పాలి.

కానీ తాజాగా కృష్ణ వంశి రంగమార్తాండలో అనసూయ గ్లామర్ కాదు కాదు స్పైసీ పాత్ర చెయ్యబోతున్నట్టుగా దర్శకుడు కృష్ణవంశీనే స్వయానా చెప్పాడు. రమ్యకృష్ణ – ప్రకాష్ రాజ్ కాంబోలో కృష్ణవంశీ తెరకెక్కించనున్న రంగమార్తాండ లో అనసూయ కి రోల్ ఇవ్వడమే కాదు.. మంచి గ్లామర్ అండ్ స్పైసి రోల్ అంటూ హింట్ కూడా ఇచ్చేసాడు కృష్ణవంశీ. మరి హాట్ ఫొటో షూట్స్ తో హాట్ హాట్ గా రెచ్చిపోయే అనసూయ ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో స్పైసి అందాలను చూపెట్టబోతుందట. అయితే ఇప్పుడు అందరూ అనసూయ స్పైసి అంటే ఏమిటి అంటున్నారు. ఎందుకంటే బుల్లితెర మీద ఎప్పుడు స్పైసీగా రెచ్చి పోయే అనసూయ రంగమార్తాండ లో ఇంకెలా రెచ్చిపోతుందో అంటున్నారు.

Tags:    

Similar News