అక్కడ అరెస్ట్..ఇక్కడ ఉద్వాసన?

జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి లు నిన్నగాక మొన్న విశాఖలో జరిగిన రైడ్ లో పోలీస్ లకు పట్టుబడడంతో.. ఎంతో పేరున్న జబర్దస్త్ కి మాయని మచ్చ [more]

Update: 2020-03-06 06:30 GMT

జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి లు నిన్నగాక మొన్న విశాఖలో జరిగిన రైడ్ లో పోలీస్ లకు పట్టుబడడంతో.. ఎంతో పేరున్న జబర్దస్త్ కి మాయని మచ్చ వచ్చి పడింది. గతంలో జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నటుడు ఓ మసాజ్ పార్లల్ లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. అప్పట్లో అతను ఫామ్ లో ఉండడంతో ఆ విషయం చాలా తక్కువ సమయంలోనే మరుగున పడిపోయింది. తాజాగా దొరబాబు, పరదేశి విషయం అల లేదు. ప్రస్తుతం ఆది స్కిట్స్ లో కామెడీ చేసుకుంటున్న దొరబాబు వాళ్ళు అలా అక్కడ విశాఖ రైడ్ లో పట్టుబడడంతో.. ఇప్పుడు ఇక్కడ జబర్దస్త్ లో వాళ్ళ మీద వేటు పడింది.

దొరబాబు, పరదేశి చేసిన పనిని మల్లెమాల టీం చాలా సీరియస్ గా తీసుకుంది. అక్కడ అరెస్ట్ అయ్యి…. పరువు పోగొట్టుకున్న దొరబాబు అండ్ పరదేశికి ఇక్కడ కెరీర్ మీద దెబ్బపడింది. మల్లెమాల వాళ్ళని జబర్దస్త్ నుండి బయటికి పంపించడానికి రెడీ అవడమే కాదు… ఇప్పటికే జ‌బ‌ర్‌ద‌స్త్ షో నుంచి వీరిద్ద‌రినీ తొలిగిస్తూ ఓ నిర్ణయం కూడా తీసుకున్నారట. హైపర్ అది స్కిట్ లో దొరబాబు తనకు తెలియకుండానే ఆడియన్స్ ని నవ్వించడానికి కారణం… ఆది డైరెక్ట్ గా దొరబాబు బూతు వీడియోస్ మీద పంచ్ లు వెయ్యడమే ప్రేక్షకులు నవ్వడానికి కారణం. ఇక ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాల్ని ప్రోత్స‌హిస్తున్న‌వాళ్లు టీమ్ లో ఉంటే.. జబర్దస్త్ కి చెడ్డపేరు రావడం, అలాగే షో టీఆర్పీ రేటింగ్స్ విషయంలోనూ తేడా కొట్టే అవకాశం ఉండడంతో.. దొరబాబు ని, పరదేశిని జబర్దస్త్ నుండి ఉద్వాసన పలకడానికి మల్లెమాల తగిన చర్యలు చేపట్టిందట.

Tags:    

Similar News