ఐటెం కోసం భారీ సెట్.. మరి ఐటెం గర్ల్ ఎవరో?

Update: 2018-11-17 06:26 GMT

రామ్ చరణ్ - బోయపాటి వినయ విధేయ రామ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది కానీ.. పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ వినయ విధేయ రామ కొసం ఒక మాస్ మసాలా ఐటెంకి ట్యూన్స్ రెడీ చేసిన విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా పక్కా మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటుగా టీజర్ కూడా ఈ సినిమా మాస్ ఎంటెర్టైనెర్ అని ప్రూవ్ చేసింది. మరి బోయపాటి... రామ్ చరణ్ ని మాస్ కాదు ఊర మాస్ గా ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

భారీ లెవల్ లో ఐటెం సాంగ్

అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉండబోయే ఐటెం సాంగ్ కోసం భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారట. బోయపాటి సినిమాల్లో ఉండే మాస్ కి తగ్గట్టుగా మాస్ ఐటెం ఉంటుంది. అందుకే దానికి తగ్గ భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నారట. హైదరబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తారని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ మామా మియా అంటూ రచ్చ చెయ్యబోయే ఆ స్పెషల్ ఐటెం సాంగ్ లో ఆడి పాడబోయే హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కేథరిన్, రకుల్ ప్రీత్, శ్రద్ద కపూర్ ఇలా చాలా పేర్లని పరిశీలించారు కానీ.. ఇంతవరకు రామ్ చరణ్ కోసం ఐటెం పాప మాత్రం రెడీ కానేలేదు. మరి బోయపాటి వేయించిన ఆ భారీ స్పెషల్ సెట్ లో ఐటెం కోసం దిగబోయే ఆ ఐటెం గర్ల్ ఎవరనే ఆసక్తితో మెగా అభిమానులు ఉన్నారు. చూద్దాం వినయ విధేయ రామ కోసం ఏ టాప్ హీరోయిన్ ఐటెం అవతారమెత్తుతుందో అనేది.

Similar News