జెర్సీలో ఐటెం సాంగ్.. హీరోయిన్ ఆమె..!

వరుసగా రెండు ఫ్లాప్ ల తరువాత నాని జెర్సీ అనే సినిమాతో వస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి చిత్రాలతో మార్కెట్ ని పోగొట్టుకున్న నాని ప్రస్తుతం [more]

Update: 2019-02-10 08:37 GMT

వరుసగా రెండు ఫ్లాప్ ల తరువాత నాని జెర్సీ అనే సినిమాతో వస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి చిత్రాలతో మార్కెట్ ని పోగొట్టుకున్న నాని ప్రస్తుతం అతను చేస్తున్న జెర్సీపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం జెర్సీ సినిమా షూటింగ్ జరుగుతుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా లో నాని క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఐటం సాంగ్ కోసం అదా శ‌ర్మ‌

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒక ఐటెం సాంగ్ ఉందట. దాని కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదా శర్మ జెర్సీ సినిమాలో ఐటెం సాంగ్ తో ఎంటర్టైన్ చేయనుంది. హీరోయిన్స్ గా కొనసాగుతున్న కాజల్, తమన్నా, పూజా లాంటి హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఆదా శర్మ చేరింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News