బెల్లంకొండ శ్రీనివాస్ మామూలోడు కాదు..!

సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు డైరెక్టర్స్. [more]

Update: 2019-01-29 06:35 GMT

సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు డైరెక్టర్స్. శ్రీనివాస్ మొదటి సినిమా నుండి ఐటెం సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్ సందడి చేశారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ తో సందడి చేయనున్నాడు శ్రీనివాస్. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో శ్రీనివాస్ కి జోడీగా కాజల్ నటిస్తుంది.

ఐటెం సాంగ్ లో పాయల్…

రెండో హీరోయిన్ గా మన్నారా చోప్రా నటిస్తోంది. రీసెంట్ గా గణతంత్ర దినోత్సవం నాడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఇందులో ఐటెం సాంగ్ లో పాయల్ రాజ్‌పుత్ సందడి చేయనుంది. ‘ఆర్ఎక్స్ 100’తో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామతో సాయి శ్రీనివాస్ స్టెప్పులు వేయనున్నాడు. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Tags:    

Similar News