‘సాహో’ ప్రభాస్ దొరికిపోయాడుగా?

భారీ అంచనాల మధ్య రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ‘సాహో’. ప్రభాస్ సరికొత్త యాంగిల్ లో కనిపించనున్న ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్. [more]

Update: 2019-08-01 08:34 GMT

భారీ అంచనాల మధ్య రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ‘సాహో’. ప్రభాస్ సరికొత్త యాంగిల్ లో కనిపించనున్న ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్. రీసెంట్ గా మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘సైకా సయాన్’ అనే పాటను రిలీజ్ చేసి తీవ్ర విమర్శలకు దారి తీశారు. ఈ సాంగ్ అసలు తెలుగు నేటివిటీ కి తగ్గట్టు లేదని ఏదో హిందీ పాట ని తెలుగు లో డబ్ చేసినట్టు ఉందని చాలా మంది తో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.

టీజర్ ను కూడా ….

ఇక నిన్నే మరో సాంగ్ ని రిలీజ్ చేసారు.‘ఏ చోట నువ్వున్నా..’ అంటూ సాగే పాట టీజర్ ఆహ్లాదకరంగా అనిపించింది. ఇందులో ప్రభాస్ లుక్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ట్యూన్ కూడా చాలా బాగుంది. కానీ ఈ పాట ను ఆలా రిలీజ్ చేసారో లేదో వెంటనే నెటిజన్లు గాలి తీసేశారు. అవును ఈ పాట ‘డోంట్ గో అవే’ అనే ఇంగ్లిష్ పాప్ ఆల్బంలోని పాటకు కాపీ అనే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. రెండింటిని కంపేర్ చేసి ఆ వీడియో ని సోషల్ మీడియా లో వైరల్ చేయడం తో ప్రభాస్ ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ పాట ను కంపోజ్ చేసింది గురు రంద్వాన. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరగడంతో ‘సాహో’ టీం కంగారు పడుతుంది.

Tags:    

Similar News