ఇస్మార్ట్ బిజినెస్ స్మార్ట్ గా ఉందే

పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రేపు గురువారం వరల్డ్ వైడ్ గా భారీ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్లాప్స్ లో [more]

Update: 2019-07-17 07:31 GMT

పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రేపు గురువారం వరల్డ్ వైడ్ గా భారీ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న పూరి, రామ్, ఛార్మి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నాభ నటేశ లకు ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. ఆయితే ఇస్మార్ట్ శంకర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇస్మార్ట్ ట్రైలర్ తోనే సినిమా మీద పూరి అంచనాలు పెంచగలిగాడు. రామ్ కెరీర్ లోనే కొత్తగా ట్రై చేస్తున్న ఈ శంకర్ పాత్ర మీద యూత్ లోను సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలతోనే వరల్డ్ వైడ్ గా ఇస్మార్ట్ బిజినెస్ జరిగింది.

ఏరియా: ప్రీ రిలీజ్
నైజాం 6.50
సీడెడ్ 2.52
అర్బన్ ఏరియాస్ 1.40
ఈస్ట్ గోదావరి 1.05
కృష్ణ 0.95
గుంటూరు 1.10
వెస్ట్ గోదావరి 0.90
నెల్లూరు 0.48

ఏపీఅండ్ టీఎస్: 14.90

ఇతర ప్రాంతాలు 1.20
ఓవర్సీస్ 0.90

వరల్డ్ వైడ్: 17 కోట్లు

Tags:    

Similar News