జెట్ స్పీడ్ తో `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ [more]

Update: 2019-04-03 10:05 GMT

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసింది యూనిట్‌. ఈ రోజు నుండి హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. 'దిమాక్ ఖ‌రాబ్‌..' అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన‌ర్స్‌ గా పేరున్న హీరో రామ్ మ‌రోసారి అదిరిపోయే స్టెప్పుల‌తో మెప్పించ‌నున్నాడు. కాస‌ర్ల‌ శ్యామ్ రాసిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ‌, సాకేత్ పాడారు. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం అందిస్తున్నారు. ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News