పోకిరి లాంటి సినిమా అంట..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కి, తన కొడుకు ఆకాష్ పూరికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ఈ మధ్య పూరి సినిమాలు సరిగ్గా ఆడడం లేదు. దీంతో [more]

Update: 2019-02-16 10:01 GMT

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కి, తన కొడుకు ఆకాష్ పూరికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ఈ మధ్య పూరి సినిమాలు సరిగ్గా ఆడడం లేదు. దీంతో పూరితో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన సొంత బ్యానర్ లో సినిమాలు తీసుకుంటున్నాడు. ఆకాష్ కోసం పూరి కసిగా ఓ కథ రాసుకున్నాడు. అయితే అది రెడీ అయినా తరువాత ఈ కథ ఏదైనా కొంచం పేరు ఉన్న హీరోతో చేస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో తన బడ్జెట్‌ సహకరించకపోయినా రామ్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు.

వేరే సినిమాలు వదులుకున్న రామ్…

ఈ సినిమా స్టోరీ పోకిరి తరహాలో ఉంటుందని.. క్లైమాక్స్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్‌ ఉంటుందని, కమర్షియల్‌ విలువలు, పూరి మార్కు డైలాగులు దండిగా ఉంటాయని ఇన్సైడ్ టాక్. హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా కొత్తగా ఉంటుందని రామ్ కరెక్ట్ గా ఈ పాత్రకు సూట్ అవుతాడని చెబుతున్నారు. కథ విన్న రామ్ వెంటనే వేరే సినిమాలు కూడా కాదనుకుని పూరితో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేస్తున్నాడు. రామ్ కి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం అవసరం. మరి ఈ సినిమా పూరిని తిరిగి టాప్‌ లీగ్‌లోకి.. రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News