అందుకే ఆ మూవీ ఒప్పుకుంది

ఇస్మార్ట్ శంకర్ లో హాట్ హాట్ గా దుమ్మురేపిన నిధి అగర్వాల్ కి.. ఆ సినిమా తర్వాత తెగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది. ఈదెబ్బకి స్టార్ [more]

Update: 2019-11-09 03:26 GMT

ఇస్మార్ట్ శంకర్ లో హాట్ హాట్ గా దుమ్మురేపిన నిధి అగర్వాల్ కి.. ఆ సినిమా తర్వాత తెగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది. ఈదెబ్బకి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనకుంది ఈ హాట్ సుందరి. కానీ ఓ డెబ్యూ హీరోకి హీరోయిన్ గా చెయ్యాల్సి వస్తుంది. అది కూడా మహేష్ బావ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ వెండితెరకు పరిచయమవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. త్వరలోనే మొదలుకాబోతున్న ఈ సినిమాకోసం నిధిని సంప్రదించడం. ఆమె ఒప్పుకోవడం జరిగిపోయింది. అయితే డెబ్యూ హీరో సరసన నటించడానికి నిది అగర్వాల్ ఓ కండిషన్ పెట్టినట్లుగా టాక్.

ప్రస్తుతం ఫామ్ లో ఉన్న తనకి రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాలనే కండిషన్ మీదే అశోక్ గల్లా కి హీరోయిన్ గా సైన్ చేసిందట ఈ భామ. మరి హాట్ యాంగిల్ లోను, నటనలోనూ పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ అయితే అశోక్ కి కూడా క్రేజ్ వస్తుందని.. భావించిన మేకర్స్ నిధి అగర్వాల్ చెప్పింది ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో ఇప్పటివరకు అందుకొని పారితోషికానికి డబుల్ అంటే కోటి 25 లక్షల పారితోషికం అందుకుంటుందని మీడియా కోడై కూస్తుంది. ఇస్మార్ట్ హిట్ నిధికి ఇక్కడ బాగా కలిసొచ్చినట్టే. మరి గతంలోనూ బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ ని హీరోగా పెట్టి సినిమాలు చేసినప్పుడు కూడా ఇలానే హాట్ అండ్ క్రేజీ హీరోయిన్స్ ని భారీ పారితోషికాలకు తెచ్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి గల్లా అశోక్ కూడా జాయిన్ అయ్యాడన్నమాట.

Tags:    

Similar News