మొదటిరోజు దడదడలాడించిన ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో విడుదలైంది. మొదటి షోకే మిక్స్డ్ టాక్ [more]

Update: 2019-07-19 07:33 GMT

పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో విడుదలైంది. మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఇస్మార్ట్ శంకర్ కి భారీ ఓపెనింగ్స్ పడ్డాయి. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ గా కనబడుతున్నాయి. రామ్ మార్కెట్ డల్ అయినా.. పూరి మార్కెట్ జీరో అయినా.. ఇస్మార్ట్ మీద ఆయా ఆఛాయలేమి కనబడలేదు. ఇక ఇస్మార్ట్ మొదలైనప్పుడు జీరో అంచనాలున్నా… ఇస్మార్ట్ మీద విడుదలయ్యే సరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలతోనే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రామ్ ఎనర్జటిక్ నటన, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ అండ్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఇస్మార్ట్ ప్లస్ పాయింట్స్ గా మారడంతో.. ఈ వీకెండ్ ఇస్మార్ట్ శంకర్ జోరు పెరిగేలా కనబడుతుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చినా.. ఇస్మార్ట్ కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి ఇస్మార్ట్ శనకర్ మొదటి రోజు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా మీ కోసం….

ఏరియా: షేర్ (కోట్లలో )
నైజాం 3.43
సీడెడ్ 1.20
నెల్లూరు 0.30
కృష్ణ 0.53
గుంటూరు 0.57
వైజాగ్ 0.86
ఈస్ట్ గోదావరి 0.50
వెస్ట్ గోదావరి 0.40

టోటల్ ఏపీ & టీస్ షేర్: 7.79

Tags:    

Similar News