మణిరత్నం సినిమాలో ఐశ్వర్య పాత్ర ఎంటో తెలుసా..?

ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’కు సంబంధించి ప్రస్తుతం స్టోరీతో పాటు నటీనటుల్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు మణి. అయితే [more]

Update: 2019-05-17 06:29 GMT

ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’కు సంబంధించి ప్రస్తుతం స్టోరీతో పాటు నటీనటుల్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు మణి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఐశ్వర్య నటించేందుకు ఓకే చెప్పిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయనుంది. పెళ్లి అయిన తరువాత ఐషు సినిమాలు చాలా తక్కువగా చేస్తుంది. సరైన పాత్ర ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటున్న టైంలో మణి ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. గతంలో వీరి కాంబినేషన్ సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమా చాలా ప్రత్యేకం అని ఇన్సైడ్ టాక్.

ఎన్ని సమస్యలు వచ్చినా సినిమా చేయాల్సిందే

మరి ఐశ్వర్య రాయ్ ని విలన్ గా ఆమె ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనేది పెద్ద ప్రశ్న. అయితే మణిరత్నం ఏదో మ్యాజిక్ చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారంట. మరోవైపు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తమ వల్ల కాదని ప్రాజెక్ట్ ను వదిలేసి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ మణి వర్క్ ఆపలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. లైకా వారు కాకుంటే మరో నిర్మాణ సంస్థ అయినా ఈ సినిమాను నిర్మిస్తుందని నమ్మకంతో ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ కి ఎన్ని సమస్యలు వచ్చినా ఆగేలా లేదు ఎందుకంటే ఇది మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి. త్వరలోనే దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News