మెగాస్టార్ తో రికమండేషన్ చేయించుకోనున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2 న ఈసినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సైరా [more]

Update: 2019-07-11 08:02 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2 న ఈసినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సైరా లో ముఖ్యపాత్ర లో బాలీవుడ్ మెగాస్టార్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సైరా తరువాత చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈసినిమా లో తన పాత్ర కోసం చిరు వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడు.

ఇక డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా కోసం క్యాస్టింగ్ పనులను చూసుకుంటున్నారు. అయితే ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈమూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కారణం చిరు సైరా చిత్రం షూటింగ్ లేట్ అవడమే. అయితే ఇంతవరకు కొరటాల హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. ఆమధ్య అనుష్క, తమన్నా, నయనతార వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ అవి ఏమి ఫైనల్ కాలేదు.

కొత్త ఫ్రెష్ పేస్ ని తీసుకోవాలి కొరటాల భావిస్తున్నాడట. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ ని రంగంలోకి దింపాలని కొరటాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే డైరెక్ట్ గా ఆమెను కాంటాక్ట్ చేస్తే ‘నో’ చెబుతుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ రికమండేషన్ తో ఐశ్వర్యా రాయ్ ఒప్పించాలని చూస్తున్నారట. అమితాబ్ ఆల్రెడీ చిరు తో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఈయన ద్వారా ఆమె ని ఒప్పించే ప్రయత్నం చేయన్నునారు. మరి అందుకు ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఐశ్వర్య నటించలేదు. ఒకవేళ నటిస్తే ఇదే మొదటి సినిమా అవుతుంది.

Tags:    

Similar News