ఐశ్వ‌ర్యారాయ్, భ‌న్సాలీకి మధ్య ఎందుకు విభేదాలు?

Update: 2018-08-31 05:28 GMT

మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ప్రస్తుతం బాలీవుడ్ లో అనురాగ్ క‌శ్య‌ప్ డైరెక్షన్ లో 'గులాబ్ జ‌మూన్‌' అనే సినిమా చేస్తుంది. మ్యారేజ్ తర్వాత వరస సినిమాలతో బిజీ అయినా ఐశ్వర్య కి జోడిగా తన భర్త అభిషేక్ బ‌చ్చ‌న్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు ఐషు బాలీవుడ్ సంచలన దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ చెప్పిన స్టోరీ లైన్ ను రిజెక్ట్ చేసిందంట. అయితే వారి మధ్య విభేధాలకు ఉన్నాయని.. అందుకే ఆయన చెప్పిన స్టోరీని రిజెక్ట్ చేసినట్టు బాలీవుడ్ సమాచారం.

గతంలో వీరి కాంబినేషన్ దేవ‌దాస్, హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌, గుజారిష్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు తర్వాత కూడా భ‌న్సాలీ చాలాసార్లు ఐషుకు అవకాశాలు ఇచ్చారు. ప‌ద్మావ‌త్, రామ్ లీల‌, భాజీరావ్ మ‌స్తానీ వంటి సినిమాల్లో ఐషుకి ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆమె ఆ అవకాశాలు కాదనుకుంది. ఐషు రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయినా సంగతి తెలిసిందే.

ఇటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఐషు వదులుకోవడానికి చాలా పెద్ద కారణాలే ఉండి ఉంటాయి అని బాలీవుడ్ టాక్. కానీ ఐషుకి దగ్గర వ్యక్తులు చెబుతున్న మాట మాత్రం భ‌న్సాలీకి..ఐశ్వ‌ర్యారాయ్‌ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. మరి ఐషుకి వచ్చిన ఆఫర్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తుందో ఆమెకే తెలియాలి.

Similar News