అచ్చం అమ్మలాగే ఉందిగా

Update: 2018-06-10 07:24 GMT

తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ శ్రీదేవి అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిపోయింది. ఈ ఏడాది దుబాయ్ లో మరణించిన శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లు అంటే ప్రాణం. తన గారాల పట్టి జాన్వీ కపూర్ ని వెండితెర మీద చూసుకోవాలని కలలు కనింది. కానీ ఆ కల తీరకముందే నింగికెగిరిపోయింది. అచ్చం అమ్మలాగే అందాన్ని పుణికి పుచ్చుకున్న జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం మూవీ ధఢక్ జులై నెలల్లో విడుదల కానుంది. కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ఇషాన్ కత్తర్ తో జోడిగా జాన్వీ కపూర్ ధఢక్ సినిమా చేసింది. మరి బయట ఎప్పుడూ గ్లామర్ షో అంటే అందచనలను ఆరబోస్తూ బుల్లి బుల్లి బట్టలేసుకుని తిరిగే జాన్వీ కపూర్ ధఢక్ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా చుడీదార్స్ లో అదరగొడుతుంది.

సినిమా మీద హైప్ క్రియేట్ చేసందుకు దర్శక నిర్మతలు ధఢక్ సినిమా పోస్టర్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. మరా పోస్టర్స్ లో జాన్వీ కపూర్ చాలా అందం గా అమాయకంగా అచ్చం అమ్మ శ్రీదేవిలాగే కనబడుతుంది. మరి శ్రీదేవి లేని లోటు జాన్వీ కపూర్ పూరిస్తుందా? అనే ఆనందం అందరిలో మొదలైంది. మరి శ్రీదేవి హీరోయిన్ గా మారాక అందం, అమాయకత్వం కలబోసిన అందమైన అమ్మాయిగా అనేక అవకాశాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. అందం, అభినయం ఉన్న శ్రీదేవికి గడుసుదనం చాలా తక్కువ. చాలా సౌమ్యంగా ఉండేది శ్రీదేవి. మరి తన కూతుళ్లు జాన్వీ, ఖుషి లను కూడా తల్లి చాటు బిడ్డల్లాగే పెంచింది. కానీ ఆమె మరణాంతరం శ్రీదేవి బాధ్యతలను ఆమె సవతి పుత్రుడు అర్జున్ కపూర్ తీసుకుని తన చెల్లళ్ళ కు అండగా నిలబడుతున్నాడు.

ఇక జాన్వీ తెరంగేట్ర చిత్రంతో అందరిని మెప్పించి హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. జాన్వీ కూడా అమ్మలాగే పదికాలాలపాటు సినిమాల్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు కూడా. ఇక జాన్వీ అమ్మ అందం అయితే పుణికి పుచ్చుకుంది. కానీ అభినయం, అమాయకత్వాన్ని ఎంతవరకు తీసుకుందో అనేది మాత్రం ఆమె నటించిన ధఢక్ సినిమా విడుదలయితేనే తెలుస్తుంది. ఇక ధఢక్ పోస్టర్స్ లో ఇషాన్ ఖత్తర్, జాన్వీ కపూర్ లను లా చూస్తుంటే.. అబ్బా ఏముందిరా ఈ జంట అనిపిస్తుంది. ఇషాన్ కి కూడా ఈ సినిమాతోనే సినిమా లకు పరిచయం అవుతున్నాడు. మరి ఇద్దరూ వెండితెరకు కొత్తవారే. ఇక వెండితెర మీద వీరి రొమాన్స్ ఎలా వుండబోతుందో... కొద్దిగా వెయిట్ చేస్తే తెలిసిపోతుంది

Similar News