ఇక ఆ హీరోయిన్ పని గోవిందా..!!

Update: 2018-10-14 06:31 GMT

తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో అవకాశాలు రావంటుంటారు. అది అనడం కాదు నిజంగా నిజమే. తెలుగు హీరోయిన్స్ తెలుగులో కాకుండా ఇతర భాషల్లో బిజీ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బ పరిస్థితి అలానే కనబడుతుంది. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న ఇషా రెబ్బ స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అనగానే ఎమన్నా ఫేట్ మారుతుందేమో అనుకుని ఎగిరి గంతేసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అరవింద సమేత - వీర రాఘవ సినిమాలో అరవింద గా పూజ హెగ్డే నటిస్తే... పూజ చెల్లెలిగా ఇషా రెబ్బ నటించింది. అయితే అరవింద సమేత సినిమా షూటింగ్ సమయంలో అరవింద సమేతలో ఇషా రెబ్బ పాత్ర పెద్దగా లేదంటూ కథనాలు రావడంతో.. వెంటనే ఈషా రెబ్బ లైన్లోకొచ్చి.. అరవింద సమేతలో తన పాత్ర ఎన్టీఆర్ తోనే ట్రావెల్ చేస్తుందని.. కేవలం ఒకటిరెండు సీన్స్ లో తానూ నటించలేదని.. అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత సెట్స్ లో చాలా జోవియల్ గా ఉంటాడని.. ఎన్టీఆర్ ని తెగ పొగిడేసింది.

మూడు నాలుగు సీన్లకు మాత్రమే.....

అయితే సినిమా విడుదలయ్యాక కానీ తెలియలేదు. ఇషా కేరెక్టర్ సినిమాలో ఎలా ఉంటుంది అనేది. కేవలం మూడు నాలుగు సీన్స్ కి మాత్రమే ఇషా రెబ్బ పరిమితమయ్యింది. సినిమా నిడివి ఎక్కువవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇషా రెబ్బ ఉన్న సీన్స్ ని ఎడిటింగ్ లో లేపేసారని.. టాక్ నడించింది. మరి స్టార్ హీరో సినిమాలో నటిస్తే ఫేమస్ అవుతుంది అనుకుంటే... ఉన్న కాస్త క్రేజ్ ఇషా ఈ సినిమాతో పోగొట్టుకుందంటున్నారు.

అనవసరంగా నటించి.....

అర్ధం పర్ధం, అసలు ప్రాధాన్యం లేని పాత్రలో ఇషా నటించి అనవసరంగా చులకన అయ్యిందంటూ కామెంట్స్ పడుతున్నాయి. మరి ఈ సినిమా చూసాక ఇషా ఇలా చిన్న పాత్రలకే పరిమితం అవుతుందని.. వచ్చే అవకాశాలు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు జనాలు. మరి ప్రస్తుతం కన్నడ మూవీలో హీరోయిన్ ఆఫర్ చేజిక్కించుకున్న ఇషా రెబ్బ ఆ సినిమాతో అక్కడ జెండా పాతుతుందేమో చూడాలి. ఎందుకంటే చిన్న హీరోల కోసం దర్శకనిర్మాతలు ఇప్పుడు అరవింద సమేత చూసాక ఇషా రెబ్బ పేరు పరిశీలిస్తారంటే కాస్త అనుమానమే.

Similar News