రామ్ అదరకొట్టాడు

రామ్ హీరోగా పూరి డైరెక్టర్ గా నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ రూపొందింది. జులై 18 న ఈమూవీ [more]

Update: 2019-07-13 06:46 GMT

రామ్ హీరోగా పూరి డైరెక్టర్ గా నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ రూపొందింది. జులై 18 న ఈమూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసాయి. అయితే నిన్న సాయంత్రం ఈసినిమా రెండో ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

రొమాంటిక్ సీన్స్……

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ 2 అనే పేరుతో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ కాంబినేషన్లోని రామ్ రొమాంటిక్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో హీరో రామ్ తెలంగాణ కుర్రోడిగా నటించాడు. ఆయన డైలాగ్ డెలివరీ అండ్ మేనరిజమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. తెలంగాణ యాసతో రామ్ అదిరికొట్టాడనే చెప్పాలి. పూరి తనదైన స్టైల్ డైలాగ్స్ రాసాడు. ముఖ్యంగా ఈసినిమా ట్రైలర్ ప్రకారం చూస్తుంటే మాస్ ఆడియన్స్ ను అలరించాలనే ఉంది. మణిశర్మ సంగీతం ఈచిత్రానికి హైలైట్ గా నిలవనుంది అని సమాచారం.

Tags:    

Similar News