ఎందుకింత క్లారిటీ ఇచ్చారో?

చిరు – కొరటాల సినిమా ఆచార్య ని రామ్ చరణ్ మరో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నట్టుగా చిరు సినిమా మొదలైనప్పుడు అన్నారు. తాజాగా రామ్ [more]

Update: 2020-03-22 07:29 GMT

చిరు – కొరటాల సినిమా ఆచార్య ని రామ్ చరణ్ మరో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నట్టుగా చిరు సినిమా మొదలైనప్పుడు అన్నారు. తాజాగా రామ్ చరణ్ ఆచార్య సినిమాలో పార్టనర్ కాదని, కేవలం సినిమాని కొణిదెల ప్రొడక్షన్ లో సమర్పిస్తున్నాడని అంటున్నారు. మరోపక్క చిరు పారితోషకం, లాభాల్లో వాటా, రామ్ చరణ్ గనక ఆచార్య లో నటిస్తే రోజుకి కోటి చొప్పున 30 రోజులకి 30 కోట్లు.. ఇలా రూపాయి సినిమా మీద పెట్టకుండా మూడు వాటాలు తీసుకెళ్తున్నారు మెగా హీరోస్ అంటూ వెబ్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.

ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి హడావిడిగా ఓ ప్రెస్ నోట్ రిలీస్ చేసారు. అదేమంటే ఆచార్య సినిమాకి రామ్ చరణ్ కూడా వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ అని, రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి ఆచార్య ని నిర్మిస్తున్నారని, రామ్ చరణ్ వాటాదారుడు కాడని వస్తున్న వార్తల్లో నిజాలు లేవంటూ మీడియాకి ప్రెస్ నోట్ వదిలారు. అయితే చరణ్ భాగస్వామి కాకపోతే సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనే ఆలోచనతోనే చరణ్ ఇలా నిరంజన్ రెడ్డి చేత ప్రెస్ నోట్ ఇప్పించాడనే టాక్ వినబడుతుంది

Tags:    

Similar News