లూసిఫెర్ పవన్ చేస్తున్నాడా..?

చిరంజీవి మలయాళ రీమేక్ లూసిఫెర్ రీమేక్ చేస్తున్నారనే ప్రచారం ఉండడం, రామ్ చరణ్ దానిని కన్ఫర్మ్ చెయ్యడం జరిగింది. అయితే లూసిఫెర్ రీమేక్ ఏ డైరెక్టర్ తో [more]

Update: 2020-04-06 09:27 GMT

చిరంజీవి మలయాళ రీమేక్ లూసిఫెర్ రీమేక్ చేస్తున్నారనే ప్రచారం ఉండడం, రామ్ చరణ్ దానిని కన్ఫర్మ్ చెయ్యడం జరిగింది. అయితే లూసిఫెర్ రీమేక్ ఏ డైరెక్టర్ తో చెయ్యబోతున్నాడో అనే దానిమీద చాల క్యూరియాడిసిటి ఉన్నపాపిటికి.. చిరు ఇంతవరకు లూసిఫెర్ రీమేక్ పై స్పందించలేదు. కానీ తాజాగామలయాళ లూసిఫెర్ రీమేక్ కొరటాల సినిమా తర్వాత ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. అయితే ఈ సినిమాని రీమేక్ చేసే దర్శకుడు ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని అంటున్నాడు.

అయితే మలయాళ లూసిఫెర్ హక్కులను రామ్ చరణ్ కొన్నప్పటినుండి.. పవన్ కళ్యాణ్ లూసిఫెర్ ని రీమేక్ చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నాడట కదా అని అడగగా.. పవన్ కళ్యాణ్ లూసిఫెర్ రీమేక్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాడనే విషయం తనకి తెలియదని, ఒకవేళ పవన్ కళ్యాణ్ కి లూసిఫెర్ రీమేక్ చెయ్యాలని ఉంటే… ఆ హక్కులను పవన్ కళ్యాణ్ కే ఇచ్చేస్తానని.. కానీ పవన్ ఎపుడు నాతో చర్చించలేదని చెబుతున్నాడు చిరు.

Tags:    

Similar News