ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు?

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం #RRR లో చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా [more]

Update: 2019-08-06 06:12 GMT

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం #RRR లో చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే రెండు రోజులు క్రితం జరిగిన స్నేహితుల రోజు సందర్భంగా అల్లూరి, కొమరం భీమ్ ఇద్దరు మంచి స్నేహితులు అని #RRR టీం చెప్పింది.

పొంతనే లేదే….

కానీ వాస్తవం ఏంటంటే వీరిద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు అనేది. అల్లూరి 1897 లో జన్మించి, విశాఖ ప్రాంతానికి చెందిన అడవి జాతి ప్రజల హక్కుల కొరకు పోరాడి 1924లో ప్రాణాలు విడిచారు. మరి కొమరం భీమ్ ఏమో 1901లో జన్మించి హైదరాబాద్ నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1940లో మరణించడం జరిగింది.ఈ లెక్కలు ప్రకారం చూస్తుంటే వీరిద్దరూ అసలు కలిసే అవకాశమే లేదు. అసలు వీరు కలిసినట్టు ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. మరి అలాంటిది వీరిద్దరూ గొప్ప స్నేహితులు ఎలా అయ్యారు అనేదే ఆసక్తికరం

Tags:    

Similar News