కీర్తి ప్రేమ వార్త నిజమా?

కీర్తి సురేష్ ప్రస్తుతం గాల్లో తేలిపోతుంది. కారణం స్టార్ హీరో మహెష్ సినిమాలో కీర్తి సురేష్ కి అదిరిపోయే ఆఫర్ రావడం. మహేష్ సర్కారు వారి పాటలో [more]

Update: 2020-06-20 11:45 GMT

కీర్తి సురేష్ ప్రస్తుతం గాల్లో తేలిపోతుంది. కారణం స్టార్ హీరో మహెష్ సినిమాలో కీర్తి సురేష్ కి అదిరిపోయే ఆఫర్ రావడం. మహేష్ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసాడు దర్శకుడు పరశురామ్. తర్వాత కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ నిన్న ఓటిటి ప్లేట్ ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల వద్దకు వచ్చేసింది. థియేటర్స్ లక్డౌన్ కారణంగా పెంగ్విన్ నిర్మాతలు కీర్తి సురేష్ పెంగ్విన్ ని ఒత్తిడి ద్వారా విడుదల చేసారు. అయితే ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాల్తో బిజీగా వున్న కీర్తి సురేష్ మొన్నామధ్యన ప్రేమ వివాహం చేసుకుంటాను.. అది పెద్దలను ఒప్పించే. ప్రస్తుతానికి ప్రేమ దోమ ఏం లేదంది.

కానీ తాజాగా కీర్తి సురేష్ డీప్ లవ్ లో ఉందని.. ఆమె తన ప్రేమ వ్యవహారం సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటుంది అని.. ఐదేళ్లు ప్రేమించుకున్న సమంత – నాగ చైతన్యల ప్రేమ వ్యవహారం విషయంలో ఎంత సీక్రెట్ నడించిందో… కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారం విషయంలోనూ అంతే సీక్రెట్ ఉందని.. కీర్తి సురేష్ తన ప్రేమ వ్యవహారం దాచి పెట్టి.. తన చేతిలో ఉన్న సినిమాలను త్వరత్వరగా పూర్తి చేసి.. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ని అందరికి పరిచయం  చేసే ప్రోగ్రాం పెట్టుకుంది అనే టాక్ అయితే కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతుంది. 

Tags:    

Similar News