కైరా అద్వానీ డేటింగ్ లో ఉంది

బాలీవుడ్ లో వచ్చిన రూమర్స్ మరి ఏ ఇండస్ట్రీ లో రావేమో. తెలుగులో ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ’ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న [more]

Update: 2019-07-03 07:49 GMT

బాలీవుడ్ లో వచ్చిన రూమర్స్ మరి ఏ ఇండస్ట్రీ లో రావేమో. తెలుగులో ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ’ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ కైరా ప్రస్తుతం హిందీలో పలు చిత్రాలు చేస్తుంది. రీసెంట్ గా ఈమె హిందీ లో నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఓ సినిమా చేస్తుంది.

‘షేర్ షా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ…ఈమూవీ స్టార్ట్ అయినా దగ్గరనుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని…ప్రేమించుకుంటున్నారని రకరకాలుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల పై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. కానీ హీరో సిద్దార్థ్ తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కైరా అద్వానీ ప్రస్తావన రాగానే డేటింగ్ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేసి మేము ఇద్దరం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పాడు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి

Tags:    

Similar News