జాకీష్రాఫ్‌ వల్లే కొంప మునిగిందా?

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మధ్య వచ్చిన [more]

Update: 2019-08-31 06:41 GMT

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈమూవీ డివైడ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ తో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో నడుస్తుంది. ఈ వీకెండ్ అయితే ఈ సినిమా భవిషత్తు ఏంటో అర్ధం అయిపోతుంది. సినిమా విఫలం అవ్వడానికి కారణం ఏంటో విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు అభిమానులు. ముఖ్యంగా ఈచిత్ర దర్శకుడు మీద ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

స్క్రీన్ ప్లే చాలా దరిద్రంగా ఉందని.. దానితో పాటు ఈమూవీలో ప్రభాస్ తండ్రి గా జాకీష్రాఫ్‌ను తీసుకోవ‌డాన్ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. అసలు సినిమా ఫెయిల్ అవ్వడానికి జాకీష్రాఫ్‌ కు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అతను గతంలో తెలుగు లో చాలానే సినిమా లు చేసారు. కానీ ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. పైగా అన్ని డిజాస్టర్సే. ఐరెన్ లెగ్ ముద్ర వేసి ఉన్న ఈయన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా పంజా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ శ‌క్తి.. మంచు విష్ణు చిత్రం అస్త్రం వంటి సినిమాల్లో నటించించారు. ఇవన్నీ డిజాస్ట‌ర్లే.

తెలుగులో ఆయన పంజా తరువాత ఏ మూవీ చేయలేదు. కారణం ఐరన్ లెగ్ అనే పేరు ఉండడం. కానీ సుజీత్ ఇప్పుడు సాహో కోసం తీసుకున్నాడు. ఐరన్ లెగ్ గా పిలవబడే జాకీ ని ఎందుకు తీసుకున్నారంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకి ఇటువంటి సెంటిమెంట్స్ ఉండవు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇవి బాగా నమ్ముతారు.

Tags:    

Similar News