వాట్.. ఇల్లీబేబి ప్రెగ్నెంటా..?

Update: 2018-04-18 02:12 GMT

గోవా బేబీ ప్రస్తుతం బాలీవుడ్ ని దున్నేయాలని సౌత్ ని వదిలేసింది. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాన్ ఫోటో గ్రాఫేర్ ఆండ్రు తో చెక్కర్లు కొడుతున్న ఇలియానా... మొన్నీ మధ్యన ఆండ్రు ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడా తన పెళ్లి విషయమై స్పందించలేదు. అయితే మొన్నీ మధ్యన మాత్రం ఆండ్రు తనని చాలా బాగా చూసుకున్నాడని, తనకి అనారోగ్యం వచ్చినప్పుడు దగ్గరే ఉండి వంట కూడా చేసి పెట్టాడని... ఆ విషయంలోతాను అదృష్టవంతురాలినని కూడా చెప్పింది. కానీ పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు.

కానీ ఇలియానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. తన హాట్ ఫొటోస్ ని వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేసే ఇల్లి బేబీ పెళ్లి అన్న వార్తలు వచ్చినప్పటినుండి ఆపేసింది. అయితే తాజాగా ఇల్లీ బేబీ గ్లామర్ ను అందరికీ గుర్తు చేస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాత్ టబ్ లో రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతున్న ఈ వయ్యారి ఫొటోను ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోనే ఆండ్రు పోస్ట్ చేశాడు. ఇంకా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైం లో ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది.

ప్రస్తుతం ఇలియానా ప్రెగ్నెంట్ అనే వార్త సోషల్ మీడియా లో దావానలం లా వ్యాపించింది. బాయ్ ఫ్రెండ్ ఆండ్రు ని పెళ్లి చేసుకుందో సహజీవనం చేస్తుందో తెలియదు గాని ప్రస్తుతం ఇల్లి బేబీ ప్రెగ్నెంట్ అనే విషయం మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్న న్యూస్. ఈ మధ్యన జరిగిన రెయిడ్‌ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇలియానా గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు తేలికైన దుస్తులు ధరించిందని బీటౌన్ వర్గాలు లో గుసగుసలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తే నిజమైతే ఇలియానా అభిమానుల హార్టులు బ్రేక్ అవడం మాత్రం ఖాయం.

Similar News