కామెడీ సెట్ అవ్వుతుందా అఖిల్!!

అఖిల్ అక్కినేని మొదటి సినిమాకే మాస్ హీరో అవుదామని కలలు కన్నాడు. తర్వాత రెండు సినిమాలు చేసినా కనీసం క్లాస్ హీరో కూడా అవ్వలేదు. అఖిల్, మిస్టర్ [more]

Update: 2020-08-09 07:54 GMT

అఖిల్ అక్కినేని మొదటి సినిమాకే మాస్ హీరో అవుదామని కలలు కన్నాడు. తర్వాత రెండు సినిమాలు చేసినా కనీసం క్లాస్ హీరో కూడా అవ్వలేదు. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో వరసగా మూడు ప్లాప్స్ అయ్యాక ఇప్పుడు ప్లాప్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ పూజ హెగ్డే కున్న క్రేజ్ వలన ఈ బ్యాచిలర్ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. లేదంటే అఖిల్ నాలుగో సినిమా కొనే బయ్యర్లే కరువయ్యేవారే. ఆ విషయం అలా ఉంటే.. తాజాగా అఖిల్ కామెడీ దర్శకుడితో సినిమా కి కమిట్ అవుతున్నాడని టాక్ వినబడుతుంది.

యావరేజ్ అయినా, హిట్ అయినా ఇప్పటివరకు అపజయమే ఎరగని అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ రాసుకుని వెంకీ – వరుణ్ కోసం wait చెయ్యాలో మధ్యలో మరో మూవీ మొదలు పెట్టాలో తెలియక తికమలో ఉన్నాడు. మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాక అనిల్ రావిపూడి ఎఫ్ 3 కథ మీదే కూర్చున్నాడు. కానీ వరుణ్ – వెంకీ డేట్స్ ఇవ్వాలంటే మరో ఏడాది ఖచ్చితంగా పడుతుంది. ఈలోపు మరో మూవీ ప్లానింగ్ లో అనిల్ వున్నాడట. తాజాగా అక్కినేni యంగ్ హీరో అఖిల్ – అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ మూవీ ప్లానింగ్స్ తెర వెనుక జరుగుతున్నాయనే టాక్ వినబడుతుంది. అనిల్ రావిపూడి ఎప్పటిలాగే దిల్ రాజు బ్యానేర్ లోనే అఖిల్ మూవీ చేస్తాడని..ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందని సోషల్ మీడియా టాక్. అయితే అఖిల్ కి కామెడీ సెట్ అవుతుందా? లేదా అని అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. 

Tags:    

Similar News