ఏం తగ్గాడండి…. అలానే ఉన్నాడుగా?

బాహుబలి తర్వాత సాహో కోసం ప్రభాస్ కాస్త వెయిట్ తగ్గడానికి అమెరికా దాక వెళ్ళొచ్చాడు. అయితే సాహో సినిమాలో కొని షాట్స్ లో ఫిట్ గా కనబడినా.. [more]

Update: 2019-11-19 07:17 GMT

బాహుబలి తర్వాత సాహో కోసం ప్రభాస్ కాస్త వెయిట్ తగ్గడానికి అమెరికా దాక వెళ్ళొచ్చాడు. అయితే సాహో సినిమాలో కొని షాట్స్ లో ఫిట్ గా కనబడినా.. సినిమాలో అధిక శాతం బరువుతోనేఉన్నాడు. లుక్స్ కూడా ఏజెడ్ పర్సన్ లా కనిపించాయి. ప్రభాస్ హైట్ కి తగ్గ వెయిట్ కాకుండా కాస్త లావుగా కనిపించాడు. సాహో లో ప్రభాస్ లుక్ మీద చాలానే వార్తలొచ్చాయి. అయితే సాహో సినిమా పోవడంతో… తన తదుపరి చిత్రం జాన్ కోసం సాహో బాగా వర్కౌట్స్ గట్రా చేసి బాడీ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడన్నారు. అనడం కాదు ట్రైనర్లు ఆధ్వర్యంలో ప్రభాస్ చేసిన వర్కౌట్స్ ని ఫొటోస్ రూపంలో లీకు చేశారు. అబ్బ ప్రభాస్ బాడీ తగ్గించుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడనే అనుకున్నాం.

కానీ ప్రభాస్ మాత్రం అస్సలు వెయిట్ తగ్గలేదు. ఎందుకంటే తాజాగా ప్రభాస్ ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లిలో ఎప్పటిలాగే బొద్దుగా కనిపించాడు. ఆ పెళ్ళిలో ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించినప్పటికీ… ప్రభాస్ లుక్ పై మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. మరి ఇంత లావుగా అంటే… హీరో గా క్రేజ్ తగ్గుతుందంటున్నారు. ఇంకా ఆ పెళ్ళిలో విజయ్ దేవరకొండ, నమ్రత వంటి వారు హాజరైనా అందరి కళ్ళు బాహుబలి ప్రభాస్ మీదే ఉన్నాయి. మరి జాన్ కోసం వాళ్ళు తగ్గించుకుంటున్నాడనుకంటె… ప్రభాస్ మాత్రం ఎప్పటిలాగే వెయిట్ తో కనబడడం చూసి ఆయన ఫాన్స్ షాకవుతున్నారు. మరి ప్రభాస్ స్వతహాగా ఫుడీ. ఇలా తింటూ పొతే బాడీ షెపవుట్ అయ్యి.. మొదటికే మోసం వస్తుంది అంటూ ఫాన్స్ లో ఆందోళన మొదలయింది

Tags:    

Similar News