బాలయ్య సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

బాలయ్య – రవి కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. [more]

Update: 2019-05-12 07:53 GMT

బాలయ్య – రవి కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇందులో జగపతి బాబు మరోసారి బాలయ్యతో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఇందులో జగపతిబాబు డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. ఆల్రెడీ దీనిపై డిస్కషన్లు జరుగుతున్నట్లు బోగట్టా.

డ్యూయెల్ రోల్ ఎందుకో..?

అసలు విలన్ కు డబుల్ రోల్ ఏమిటి? దాని వైనం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. అసలు ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్? బాలయ్య పవర్ ఫుల్ ఆఫీసర్ అయినప్పుడు విలన్ కూడా అంతకు అంతా పవర్ ఫుల్ గానే ఉంటాడు. మరి విలన్ డ్యూయల్ రోల్ కనిపిస్తే ఎలా? అని చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి టైంకి రిలీజ్ చేయాలని ప్లాన్ వేస్తున్నారు.

Tags:    

Similar News