#RRR పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

రాజమౌళి భారీ అంచనాల మధ్య తెరకేస్తున్న చిత్రం #RRR. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ [more]

Update: 2019-04-29 07:10 GMT

రాజమౌళి భారీ అంచనాల మధ్య తెరకేస్తున్న చిత్రం #RRR. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి గాయం అవ్వడం కారణంగా షూటింగ్ మూడు వారాల పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరి వారంలో షూటింగ్ రెగ్యులర్ జరుగుతుందని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరో 10 రోజులు పట్టే అవకాశముంది. రామ్ చరణ్ ను మరో 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ కోరడంతో షూటింగ్ ఇంకా లేట్ అవ్వనుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుంది.

గిరిజన యువతిగా నిత్యా మీనన్..?

ఎన్టీఆర్ సరసన నటించేందుకు మరో హీరోయిన్ అవసరం ఉంది అయితే ఆ హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. అయితే ఈమూవీ లో నిత్యా మీనన్ కూడా నటిస్తుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ ను ప్రేమిస్తుందట. ఆ పాత్రలోనే నిత్యా మీనన్ నటించబోతుందని సమాచారం. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News