హరికృష్ణ గురించి ఆసక్తికర విషయం..!

Update: 2018-09-03 13:01 GMT

రచయితగా పరుచూరి గోపాలకృష్ణకి ఎంతో మంచి పేరుంది. సీనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలకి ఆయన కథ, మాటలు అందించారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కించే 'ఎన్టీఆర్' బయోపిక్ కి కూడా అయన స్క్రీన్ ప్లే అందించారు. రీసెంట్ గా ఆయన హరికృష్ణతో తనకి ఉన్న అనుబందం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా హరికృష్ణ అకాల మరణాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఇద్దరి మధ్య జరిగిన ఓ సందర్భం గురించి చెప్పారు.

భయపడ్డావా అని అడగడంతో...

"1980లో అనుకుంటాను .. రామారావుగారి 'అనురాగ దేవత' సినిమాకి పనిచేసే అవకాశం లభించింది. దాంతో నన్ను 'ఉయ్యూరు' నుంచి తీసుకురమ్మని అన్నగారు .. హరికృష్ణను పంపించారు. మా ఊరి నుంచి హరికృష్ణతో కలిసి కారులో బయలుదేరాను. అప్పుడు ఆయన తన కారును ఎంత వేగంగా నడిపాడంటే, 'నార్కెట్ పల్లి' దగ్గరికి రాగానే ఇంజన్లో నుంచి పొగలువచ్చి ఆగిపోయింది. అప్పుడు హరికృష్ణ గారు.. భయపడ్డవా అని అడిగారు నేను లేదు బాబు అన్నాను. అదేంటి ఎందుకు భయపడలేదు అని అడిగారు.

ప.గో అని పిలవడం మొదలు...

డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న మీకే భయం లేనప్పుడు నాకెందుకు? నా దృష్టిలో నా ప్రాణం కంటే నీ ప్రాణాలు ముఖ్యం'' అన్నాను. అప్పుడు ఇద్దరం దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లి కాఫీ తాగాము. అప్పుడు ఆయన 'పరుచూరి గోపాలకృష్ణ' అని కాకుండా నేను మిమ్మల్ని 'ప.గో'అని పిలుస్తాను అన్నాడు. నేను సరే బాబు అన్నాను. అప్పటి నుండి ఆయన నన్ను అలాగే పిలుస్తూ వచ్చారు అని గుర్తుచేసుకున్నారు గోపాలకృష్ణ.

Similar News