RRR పై ఆ సినిమా ఎఫెక్ట్ పడుతుందా?

RRR విషయంలో హీరోలిద్దరికి రెస్ట్ దొరికింది కానీ డైరెక్టర్ రాజమౌళి కి మాత్రం రెస్ట్ దొరకలేదు. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ కొమరం [more]

Update: 2019-10-18 08:23 GMT

RRR విషయంలో హీరోలిద్దరికి రెస్ట్ దొరికింది కానీ డైరెక్టర్ రాజమౌళి కి మాత్రం రెస్ట్ దొరకలేదు. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫలానా సినిమా నుంచి ఇన్ స్ఫైర్ అయి తీస్తున్నారు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఏది నిజమో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా RRR ఒక ఇంగ్లీష్ మూవీ నుంచి కొంత భాగం ఇన్ స్పైర్ అయ్యి తీస్తున్నారు అని టాక్.

ఆ ఎఫెక్ట్ ఉంటుందా….?

ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను వేరువేరుగా చూపించనున్నారు. కాకపోతే ఇద్దరు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తారు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమానే చేగువేరా జీవితం ఆధారంగా తెరకకెక్కిన క్లాసిక్ ఫిలిం ‘మోటార్ సైకిల్ డైరీస్’ అనే చిత్రం నుంచి కొంత భాగం ఇన్ స్పైర్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఇంగ్లీష్ మూవీలో చేగువేరా విప్లవ మార్గం ఎంచుకోక మునుపు తన స్నేహితుడితో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు బైక్ జర్నీ చేస్తాడు. ఆ జర్నీలో అతనికి ఎన్నో సంఘటనలు ఎదురు అవ్వడంతో అతను విప్లవ మార్గం వైపు వెళ్తాడు. మరి RRR లో ఇటువంటి ఎపిసోడ్ చూపిస్తారో లేదో చూడాలి. ఇక ఈ మూవీ 2020 జులై 30 న రిలీజ్ అవుతుంది. ఒకవేళ రాజమౌళి ఇన్ స్పైర్ అయి తీసినా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే విధంగా తెరకెక్కిస్తారు కాబట్టి సినిమాపై ఆ ఇంగ్లీష్ సినిమా ఎఫెక్ట్ పడదు.

 

Tags:    

Similar News