ఇంద్రగంటికి గోల్డెన్ ఆఫర్స్?

Update: 2018-06-21 10:33 GMT

ప్రతి ఏజ్ వారు చూసే విధంగా సినిమా తీయడంలో ఎక్స్పర్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. గతంలో ఆయన నుండి ‘అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, అమీ తుమీ’ 'జెంటిల్ మ్యాన్'.. లేటెస్ట్ గా సుధీర్ బాబు హీరోగా.. ‘సమ్మోహనం’ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. దాంతో ఆయన పై నమ్మకంతో పాటు ఆయన ఇమేజ్ కూడా పెరిగింది.

ఒక్కసినిమా అయినా....

‘సమ్మోహనం’ సినిమాను చూసిన కొంతమంది యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ హీరోస్ కూడా ఆయనతో ఒక సినిమా అయినా చేయాలనీ..ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారట. ముఖ్యంగా స్టార్ హీరోస్.. మోహన్ కృష్ణతో సినిమా చేయాలనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు.

వీరిద్దరూ ఇంప్రెస్ అయి....

అవును వీరిఇద్దరు ‘సమ్మోహనం’ సినిమా చూసి ఇంప్రెస్స్ అయ్యి తమ కోసం కథ రెడీ చేయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే గనుక వాస్తవమైతే ఇంద్రగంటి... వాళ్ళ కోసం ఎలాంటి కథల్ని రెడీ చేస్తారో చూడాలి. అంతేకాదు ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోస్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఆయన చుట్టూ తిరుగుతున్నారని టాక్.

Similar News