ఇండియన్ 2 విషయంలో ఏం జరుగుతుంది!!

కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ ని శంకర్ స్టార్ట్ చేసినప్పటినుండి… ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని [more]

Update: 2020-03-04 10:50 GMT

కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ ని శంకర్ స్టార్ట్ చేసినప్పటినుండి… ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్టుగా అధికారిక ప్రకటనతో హంగామా చెయ్యడం.. దర్శకుడు శంకర్ బడ్జెట్ కి భయపడి దిల్ రాజు భారతీయుడు సీక్వెల్ నుండి తప్పుడుకోవడంతో.. దిల్ రాజు ప్లేస్ లోకి లైకా ప్రొడక్షన్స్ వచ్చి చేరింది. ఇక భారతీయుడు అనుకున్నదానికన్నా ఆలస్యం అయినా ఎలాగో పట్టాలెక్కింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ అయ్యాక మల్లి బడ్జెట్ పరిమితి దాటిపోతుంది అన్నాక కొన్నిరోజులు షూటింగ్ కి బ్రేక్ వేశారు.

తర్వాత ఎలాగో మల్లి సక్రమంగా షూటింగ్ మొదలవడం… అనుకొకుండా భారతీయుడు 2 షూటింగ్ లో ఘోర ప్రమాదం జరగడం అందులో ముగ్గురు మరణించడం పెద్ద సంచలనం అయ్యింది. తర్వాత నిర్మాతలతో పాటుగా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ లు మృతులకు, గాయాలపాలైన వారికీ భారీగా విరాళం ప్రకటించడం, రోజుకొకరు చొప్పున అంటే లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, శంకర్, కమల్ హాసన్ లు పోలీస్ ల ఎదుట హాజరవుతుంబరు ఇక కమల్ హాసన్ కి లైకా ప్రొడక్షన్ కి మధ్య సోల్డ్ వార్ జరగడం లేఖాస్త్రాలు సంధించడం చూసాం. కమల్ బహిరంగ లేక.. దానికి లైకా రిప్లయ్ ఇవ్వడం అన్ని మీడియా ముఖంగానే జరిగాయి. తాజాగా కమల్ హాసన్ లైకా వారి మీద కోపంతో భారతీయుడు షూటింగ్ కి హాజరవడం లేదని అంటున్నారు. ఆ బహిరంగ లేఖల వలన కమల్ కి లైకా వారికీ మధ్య దూరం పెరిగి.. కోల్డ్ వార్ మొదలయ్యింది అని ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 నుండి తప్పుకున్న తప్పుకోవచ్చనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో మొదలయ్యింది.

Tags:    

Similar News