అలకి… బ్రహ్మి అలా పనికొస్తాడట

టాలీవుడ్ లో బ్రహ్మానందం హవా మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఏదో ఇప్పుడొస్తున్న సినిమాల్లో గెస్ట్ రోల్స్ తో గెంటుకోస్తున్న బ్రహ్మికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఒకప్పుడు బ్రాహ్మి [more]

Update: 2019-10-15 07:10 GMT

టాలీవుడ్ లో బ్రహ్మానందం హవా మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఏదో ఇప్పుడొస్తున్న సినిమాల్లో గెస్ట్ రోల్స్ తో గెంటుకోస్తున్న బ్రహ్మికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఒకప్పుడు బ్రాహ్మి కోసమే రోల్స్ రాసుకునే దర్శకులు ఇప్పుడు బ్రహ్మీని పక్కనబెట్టేశారు. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మికి ఎప్పుడు ఏదో ఓ మంచి పాత్ర దక్కినట్టుగానే ఇప్పుడు అల వైకుంఠపురములోను ఓ చిన్న కామెడీ పాత్ర దక్కింది. ఆ పాత్ర ఎలాంటిది అంటే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మీని పాయింట్ అవుట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ పాట పాడుతూ బ్రహ్మి పనిబడతాడు. ఆ పాట అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

బ్రహ్మీ ఫన్….

తాజాగా అలాంటి కామెడీ సాంగ్ బ్రహ్మి మీద అల వైకుంఠపురములో ఉండబోతుంది అనేది తాజా సమాచారం. ఈ పాట మొత్తం ఫ్యామిలీ మీద సాగుతుందని స‌ర‌దా సంద‌ర్భంలో సాగే పాటగా ఉండబోతుందని ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిందని చెబుతున్నారు. ఈ పాటలో సినిమాలోని మెయిన్ కేరెక్టర్స్ బ‌న్నీ, పూజా, ట‌బు, ప్ర‌శాంత్‌ అంతా కనబడతారు కానీ పాట మొత్తం బ్రహ్మి మీదే ఉండబోతుందట. ఇక ఈ పాట చాలా కామెడీగా ఉంటుందని ఆ కామెడీకి బ్ర‌హ్మీ ఫ‌న్ కూడా యాడ్ అవుతుందట. ఇక సినిమాలో మరెక్కడా బ్రహ్మి పాత్ర ఉండబోదని కేవలం ఈ ఫన్నీ సాంగ్ కోసమే బ్రహ్మీని త్రివిక్రమ్ తీసుకున్నాడని చెబుతున్నారు.

 

 

Tags:    

Similar News