అంచనాల మధ్య వస్తున్న స్టార్ హీరో సినిమా

మరో 24 గంటల్లో బిగిల్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ 4200 పైన స్క్రీన్స్ లో రిలీజ్ [more]

Update: 2019-10-24 07:17 GMT

మరో 24 గంటల్లో బిగిల్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ 4200 పైన స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి. విజయ్ కి ఇక్కడ ఓ మోస్తరు మార్కెట్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. బిగిల్, మైఖేల్, రాజప్ప అనే మూడు పాత్రలలో విజయ్ కనిపిస్తున్నారు.

హ్యాట్రిక్ కొట్టేనా….

మైకేల్ కోచ్ గా, బిగిల్ యంగ్ ఫుట్ బాల్ ప్లేయర్ లా, 50 ప్లస్ ఏజ్ లో మరో పాత్ర చేస్తున్నాడు విజయ్. ఇలా మూడు డిఫరెంట్ పాత్రల్లో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడు విజయ్. ఈ ముగ్గురు ఒక్కరేనా లేదా వేరువేరు పాత్రల్లో కనిపించనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ట్రైలర్ కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అసలు ఇందులో మైఖేల్ రౌడీలా ఎందుకు మారాడు, అసలు రాజప్ప కథేమిటీ అనేవి కథలో కీలక మలుపులు. రెహమాన్ సంగీతం సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. ఇక డైరెక్టర్ అట్లీ కి ఇది విజయ్ తో మూడో సినిమా. మరి దీంతో అట్లీ హ్యట్రిక్ కొడతాడా? లేదా అనేది చూడాలి. ఇక విజయ్ సరసన నయనతార నటిస్తుంది.

 

Tags:    

Similar News