అలీ బాబా కోసమే వచ్చాడా

బిగ్ బాస్ సీజన్ 3 లో అలీ రెజా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇతను బిగ్ బాస్ సడన్ గా ఎలిమినేట్ చేయడంతో అంత షాక్ అయ్యారు. [more]

Update: 2019-10-05 07:47 GMT

బిగ్ బాస్ సీజన్ 3 లో అలీ రెజా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇతను బిగ్ బాస్ సడన్ గా ఎలిమినేట్ చేయడంతో అంత షాక్ అయ్యారు. బాగా ఆడుతున్న అతను ఒక్కసారిగా సడన్ గా వెళ్లిపోయేపాటికి అతనిపై సింపతీ పెరిగింది. మళ్లీ అతన్ని తీసుకుని రావాలని ఫిక్స్ అయ్యారు బిగ్ బాస్ టీం. అయితే సడన్ గా తీసుకుని రాకుండా అలీని జనం మరచిపోయాక రీఎంట్రీ ఇప్పించిన బిగ్‌బాస్‌ ఒక వ్యూహంతో అయితే పంపించాడనేది సుస్పష్టం.

సీన్ రివర్స్…….

బిగ్ బాస్ అలీని బాబా భాస్కర్ ను టార్గెట్ చేయడం కోసం మళ్లీ ఇంటిలోకి పంపించినట్టు తెలుస్తుంది. బాబాని టార్గెట్ చేస్తూ అతడు రెండు ముఖాలు కలిగినవాడు అని, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని మిగిలిన కంటెస్టెంట్స్‌లో ఆ ఫీలింగ్ తేవడానికి బిగ్ బాస్ అలీని లోపలికి పంపినట్టు అర్ధం అవుతుంది. పైగా నాగార్జున వచ్చిన ప్రతిసారి బాబాని టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. బాబాని బయటకు పంపడమే లక్ష్యంగా ఆడుతున్నాడు అలీ. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బాబా భాస్కర్‌కి సింపతీ స్టార్ట్‌ అయింది. ఈ మధ్య గేమ్స్ అన్ని బాగా ఆడుతున్నాడు. ప్రతి టాస్క్‌లోను అదరగొడుతున్నాడు. బాబా బయటకు రావడం ఏమో కానీ అలీ కి ఉన్న మంచి పేరు అంతా చెడగొట్టుకుంటున్నాడు.

 

Tags:    

Similar News