హైపర్ ఆదికి.. గెటప్ శీనూకి ఇక ఇత్తడే!!

ఈటివి లో గురువారం, శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ తో కామెడీ ప్రియులకి పండగే. జబర్దస్ కి ఎన్ని [more]

Update: 2020-07-13 07:15 GMT

ఈటివి లో గురువారం, శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ తో కామెడీ ప్రియులకి పండగే. జబర్దస్ కి ఎన్ని ఛానల్స్ పోటీగా కామెడీ షోస్ చేయించినా అవన్నీ వెల వెల బోవడం తప్ప జబర్దస్త్ టీఆర్పీని టచ్ చేయలేకపోయాయి. జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్, సుడిగాలి సుధీర్ స్కిట్, గతంలో చమ్మక్ చంద్ర స్కిట్స్ లో కామెడీ బాగా పేలడమే కాదు…. ఆది అయితే నాన్ స్టాప్ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తాడు. హైపర్ ఆది అయినా, గెటప్ శీను అయినా.. ఈ జబర్దస్త్ కి టాప్ కమెడియన్స్ అనే చెప్పాలి. ఇప్పుడు ఓ కమెడియన్ ఈ ఇద్దరికి ఎసరు పెట్టెల కనిపిసితున్నాడు. జబర్దస్త్ కి చాలామంది కొత్త వారు కమెడియన్స్ గా అడుగుపెడుతూనే ఉంటారు. అందులో కొంతమందే బాగా పాపులర్ అవుతున్నారు.

అందులో గత కొన్నాళ్లుగా వెంకీ మంకీస్ స్కిట్ లో వచ్చే ఇమ్మాన్యువల్ వేసే కామెడీ పంచ్ లకు, అమాయకంగా చెప్పే డైలాగ్స్ కి ఇప్పుడు కామెడీ ప్రియులు పడి పడి నవ్వుతున్నారు. ఒకప్పుడు ఆది స్కిట్ అంటే పడి చచ్చే బుల్లితెర ప్రేక్షకులు… ఇప్పుడు ఇమ్మాన్యువల్ ఏ స్కిట్ చేస్తునందు చూసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇమ్మాన్యువల్ ఎప్పుడు స్టేజ్ మీదకొచ్చినా అందరి చూపు ఆ కుర్రాడి మీదే. కామెడీ.. భలే చేస్తున్నాడుగా, దానికితోడు పంచులు కూడా భలే వేస్తున్నాడు అంటూ ఎమ్మాన్యువల్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటునాన్రు. నల్లగా అంద విహీనంగా ఉన్న ఇమ్మాన్యువల్ వేసే స్పాంటినీస్ పంచ్ లకు అందరూ పడి పడి నవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ లో ఇమ్మాన్యువల్ పేరు, ఎక్కడనుండి వచ్చాడు అంటూ గూగుల్‌లో తెగ సర్చ్ చేస్తున్నారు. మరి ఆదికి, శీను కి ఇమ్మాన్యువల్ ఎర్త్ పెట్టేలాగే కనిపిస్తున్నాడు సుమీ..

Tags:    

Similar News