ఇల్లి బేబీ.. దేని కోసం ఈ ఆరాటం

  నిన్నమొన్నటివరకు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా.. బాయ్ ఫ్రెండ్ తో బాగా బిజీగా వున్న ఇలియానా సోషల్ మీడియాని మాత్రం వదలలేదు. బాయ్ ఫ్రెండ్ తో [more]

Update: 2019-09-24 06:14 GMT

 

నిన్నమొన్నటివరకు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా.. బాయ్ ఫ్రెండ్ తో బాగా బిజీగా వున్న ఇలియానా సోషల్ మీడియాని మాత్రం వదలలేదు. బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా సోషల్ మీడియాలో హాటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తుండే ఇలియానా తాజాగా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు సినిమా అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు మొదలెట్టింది. రోజూ ఇలియానా గురించే మాట్లాడుకునేలా ప్లాన్ చేసి మరీ ఈ గోవా బ్యూటీ తన హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో సంధిస్తోంది. ఇలియానా లేటెస్ట్ క్యూట్ అండ్ హాట్ ఫొటోస్ కి ఆందరూ లైక్స్ షేర్స్ తో హోరెత్తించడమే కాదు.. ఇలియానా మీద దర్శకనిర్మాతలకు కాస్త సాఫ్ట్ కార్నర్ కలిగేలా ఉంది ఇలియానా ప్రయత్నం చూస్తుంటే.

ఆరాటం…..పోరాటం…..

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఓ డాన్స్ వీడియో దుమ్మురేపుతోంది. ఆ వీడియో లో ఇలియానా బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. అందమైన నడుముతో మత్తెకించే ఇలియానా మళ్ళీ అలా బెల్లి డాన్స్ చేస్తుంటే.. అమ్మడు మాత్రం అవకాశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాబట్టే ఈ వీడియో వదిలింది అంటున్నారు. అవకాశాలు పట్టాలి, మల్లి కెరీర్ లో బిజీ అవ్వాలి అనే ఆరాటం ఇలియానా పోస్ట్ చేస్తున్న ఫొటోస్ తోనూ వీడియో తోనూ తేటతెల్లమవుతుంది.

 

 

Tags:    

Similar News