గోవా బ్యూటీ... ఇప్పటికి పెదవి విప్పింది!

Update: 2018-07-26 07:34 GMT

సన్నజాజి నడుమందాలతో తెలుగు ప్రేక్షకులను జులాయిలను చేసి బాలీవుడ్ కి చెక్కేసిన గోవా బ్యూటీ ఇలియానా... తాజాగా తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇలియానా సౌత్ డైరెక్టర్స్ గురించి సంచలనంగా మాట్లాడింది. బాలీవుడ్ లో అవకాశాలు లేక తిరిగి సౌత్ కొచ్చిన ఇలియానా గత మూడేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం సాగిస్తూ అతనితో చెట్టాపట్టాలేసుకుని వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది.

పిచ్చపిచ్చగా ప్రేమించాను...

అయితే ఆర్నెల్ల క్రితం ఆండ్రూ నీబోన్ ని ఇలియానా పెళ్లిచేసుకుందని.. పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆ పెళ్లిని ఇలియానా సీక్రెట్ గా ఉంచేసిందని.. అలాగే మధ్యలో ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు మీడియాలో షికార్లు చేశాయి. కానీ ఇలియానా మాత్రం ఆండ్రూ నీబోన్ గురించి గాని, తన పెళ్లి విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ తాజాగా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ గురించిన విషయాల గుట్టు విప్పింది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఇలియానాకి ఒక అభిమాని ఆండ్రూలో ఏం చూసి ప్రేమించారని... అతను విదేశీయుడు కదా అని అడిగిన ప్రశ్నకు ఇలియానా అస్సలేమాత్రం తడుముకోకుండా... ఆండ్రూను పిచ్చిపిచ్చిగా ప్రేమించిన మాట నిజమేనని... మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు అతను ఏ దేశం, ఏ వర్ణం, ఏ కులం ఇవేవి ఆలోచించాలని అనిపించలేదని చెప్పి తన ప్రేమను బహిర్గతం చేసింది. ఛాన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటించడం కాస్త ఇబ్బందిగానే ఉందని... కానీ మళ్లీ టాలీవుడ్ లో నటించడం మాత్రం బావుందని చెప్పింది. ఇలియానా చెప్పిన ప్రేమ వార్తలతో ఇక ఇలియానా పెళ్లిపై రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడతాయేమో చూద్దాం.

Similar News