కథ నచ్చలేదు.. పాత్రలు నచ్చలేదంటూ కథలు చెబుతుంది

Update: 2018-11-13 02:50 GMT

బాలీవుడ్ వెళ్లిన కొత్తలో ఇలియానాకి టాలీవుడ్ నుండి చాలానే ఆఫర్స్ వచ్చాయి.... కానీ ఇలియానా మాత్రం బాలీవుడ్ నే అంటిపెట్టుకుని టాలీవుడ్ ని వదిలేసింది. మధ్యమధ్యలో టాలీవుడ్ పై సెటైరికల్ డైలాగ్స్ కూడా వేసింది. బాలీవుడ్ లో బిజీ అయ్యి టాప్ హీరోయిన్ అవుతానన్న ఇలియానా ఆశల మీద బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీళ్లు చల్లారు. చానళ్లు బాలీవుడ్ ఆఫర్స్ కోసమే వేచి చూసిన ఇలియానా దిక్కులేక టాలీవుడ్ కి వచ్చేసింది. అమర్ అక్బర్ ఆంటోనీతో మళ్లీ తెలుగులోకి రి ఎంట్రీ ఇస్తుంది. అయితే అమర్ అక్బర్ అంటోని విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఇలియానా నమ్మేలేని నిజాలు చెబుతుంది.

తాను బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు బాలీవుడ్ ఆఫర్స్ తో తడిసి ముద్దయ్యిందట. ఇక అలా ఆఫర్స్ మీద ఆఫర్స్ రావడంతో బాలీవుడ్ లో బిజీ అయ్యి సినిమాలు చేసుకుపోయానని చెబుతుంది. మరి బాలీవుడ్ లో ఇలియానా సినిమాలెన్నో అందరికి తెలుసు. ఇక బాలీవుడ్ లో ఉన్నప్పుడు తనకు టాలీవుడ్ నుండి చాలా అవకాశాలు వచ్చాయని.... కానీ బాలీవుడ్ సినిమాల బిజీ కారణంగా డేట్స్ సర్దుబాటు కాలేదని చెబుతుంది ఇల్లి బేబీ. అంతేకాకుండా తనకొచ్చిన కొన్ని టాలీవుడ్ అవకాశాల్లో కొన్ని ప్రాధాన్యత లేని పాత్రలు ఉండడంతో పలు సినిమాలు రిజెక్ట్ చేసినట్లుగా చెబుతుంది.

మరి మొదట్లో ఒకటి రెండు సినిమాల విషయంలో ఇలియానా పేరు వినబడిన తర్వాత దర్శకనిర్మాతలెవరు ఇలియానా వేపు చూడలేదు. మరి అవకాశాలు వచ్చాయి.. కథలు నచ్ఛలేదు.. అందుకే నటించలేదు... పాత్రలు నచ్చలేదు.. అందుకే నటించలేదు.. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని కథ నచ్చింది అందుకే చేశానంటూ కథలు చెబుతుంది. ఇక అమర్ అక్బర్ ఆంటోని విషయంలో ఇప్పుడు మూడు విషయాల్లో అనుమానాలైతే ఎక్కువయ్యాయి. ఒకటి ఇలియానాలో మునుపుటి వయ్యారాలు లేవు. రెండు రవితేజ ప్లాప్స్, మూడు శ్రీను వైట్ల ప్లాప్స్. మరిన్ని దాటుకుని అమర్ గట్టెక్కుతాడో లేదో చూడాలి. ఇది హిట్ అయితే ఇలియానా పప్పులు ఉడికేవి.. లేదంటే...!

Similar News