కరోనాతో ఇల్లి బేబీ కష్టాలు!!

షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే తారలంతా కరోనా కారణంగా ఇంటికి పరిమితమై, నటనకు దూరంగా ఉన్నారు. కానీ ఇలియానా అయితే కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి [more]

Update: 2020-11-27 11:53 GMT

షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే తారలంతా కరోనా కారణంగా ఇంటికి పరిమితమై, నటనకు దూరంగా ఉన్నారు. కానీ ఇలియానా అయితే కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కరోనా ముందే కొత్త సినిమా ఒప్పుకుంది. అంతలోనే కరోనా రావడం తో గోవా కెళ్ళిపోయినా ఇలియానా మల్లి తాజాగా షూటింగ్ కి హాజరవుతున్నది. తాజాగా బల్విందర్ సింగ్ తెరకెక్కిస్తున్న అన్ ఫెయిర్ అండ్ లవ్లీ  సినిమా షూటింగ్ కోసం సెట్స్ లో అడుగుపెట్టింది గోవా సుందరి. కరోనా వలన షూటింగ్ స్పాట్ లో ముందు భయపడినా.. తర్వాత మెల్లగా అలవాటైపోయింది అని చెబుతుంది ఇలియానా.
కరోనా భయానికి ఇలియానా అండ్ మూవీ టీం మొత్తం షూటింగ్ స్పాట్ లో కరోనా టెస్ట్ లు చేయించుకుని.. కోవిడ్ నిబంధనల ప్రకారం షూటింగ్ చేసుకున్నామని, కరోనా తో ముందు భయపడినా తర్వాత అలవాటైపోయింది అని, కాకపోతే కరోనా వలన ఇంట్లోనే గడిపిన చాలా రోజులకి స్పాట్ లో అడుగుపెట్టినప్పుడు నా పాత్ర నటన గురించి మర్చిపోయాయనేమో అని భయపడ్డా అంటుంది. అందుకే ముందుగా రిహార్సల్స్ చేసుకుంటే బావుండేదని నేను దర్శకుడు అనుకున్నామని, కానీ షూటింగ్ స్పాట్ లోకి వెళ్ళాక కెమెరా ముందు నిలబడగానే పాత్రలోకి సహజంగానే లీనమైపోయా అంటుంది ఇలియానా. 

Tags:    

Similar News