జెర్సీని చూసి కథ మార్చుకున్న ఐకాన్..!

కాస్త లేట్ అయినా త్రివిక్రమ్ సినిమాని అల్లు అర్జున్ పట్టాలెక్కించాడు. ఇక త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కకముందే.. సుకుమార్ తో ఒక సినిమా, వేణు శ్రీరామ్ తో మరో [more]

Update: 2019-04-24 06:38 GMT

కాస్త లేట్ అయినా త్రివిక్రమ్ సినిమాని అల్లు అర్జున్ పట్టాలెక్కించాడు. ఇక త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కకముందే.. సుకుమార్ తో ఒక సినిమా, వేణు శ్రీరామ్ తో మరో సినిమాని అల్లు అర్జున్ లైన్ లో పెట్టాడు. వీటిపై ఆధికారిక ప్రకటనలు కూడా ఇప్పించాడు. త్రివిక్రమ్ సినిమా అప్ డేట్ కన్నా వేణు శ్రీరామ్ సినిమా అప్ డేట్ మీడియాలో ఎక్కువగా వినబడుతుంది. వేణు శ్రీరామ్ – అల్లు అర్జున్ కాంబో సినిమా కథ ఫిక్స్ అవడంతో పాటు ఆ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘ఐకాన్‌’ అంటూ కనబడుట లేదు అనే క్యాప్షన్ తో ఆ సినిమాకి టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ఈ చిత్రం ఓ ఫిలిప్పిన్ క‌థకు మూలం అని.. అయితే ఆ కథని తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్టుగా మార్పులు, చేర్పులు చేశార‌ని చెబుతున్నారు. ఇక ఆ కథ ప్రకారం ఐకాన్ చిత్రం క్లైమాక్స్ విషాదాంతంగా ఉండబోతుందట.

ఐకాన్ లోనూ విషాదాంతం…

ఐకాన్ కథ గురించి చెప్పాలంటే.. ఓ క్యూట్‌ ల‌వ్ స్టోరీగా స‌ర‌దా రోడ్ జ‌ర్నీగా సాగిన ఐకాన్‌ స‌డ‌న్‌గా విషాదాంతమైపోతుంద‌ట. అయితే అలాంటి క్లైమాక్స్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అనేదాని మీద నిన్నమొన్నటి వరకు ఐకాన్ టీం తర్జన భర్జనలు పడిందట. కానీ జెర్సీ సినిమాలో కూడా నాని ప్రీక్లైమాక్స్ లో చనిపోయినా దాన్ని మరీ విషాదంగా చూపించకుండా ప్రేక్షకులని కన్విన్స్ చేసే విధంగా గౌతమ్ తిన్నసూరి జెర్సీ క్లైమాక్స్ ని మలిచాడు. ఇప్పుడు జెర్సీ విషాదాంతంగా ముగిసినా.. ప్రేక్షకులు ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇక జెర్సీకి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఇప్పుడు ఐకాన్ టీం కూడా ఐకాన్ సినిమాని విషాదాంతంగానే ముగించబోతున్నారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్.

Tags:    

Similar News