బాక్స్ ఆఫీస్ ని షాక్ చేస్తున్న హ్రితిక్

ఎస్ హృతిక్‌ రోషన్ కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో వార్ సినిమాతో నిరూపితం అయింది. హృతిక్‌ – టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన ఈ [more]

Update: 2019-10-09 07:38 GMT

ఎస్ హృతిక్‌ రోషన్ కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో వార్ సినిమాతో నిరూపితం అయింది. హృతిక్‌ – టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. వారం రోజుల్లో ఈ మూవీ ఇండియాలో నెట్‌ వసూళ్లు రెండు వందల కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో రెండు వందల కోట్లు మార్క్ ను రీచ్ అయినా సినిమా వార్ ఒక్కటే.

అభిమానుల ఆనందం….

అలానే మూడు వందల కోట్ల లోటుని కూడా వార్ తీర్చుకుంది. ఇది హృతిక్‌ రోషన్‌ ఖాతాలో తొలి రెండు వందల కోట్ల చిత్రమే కాకుండా, మూడు వందల క్లబ్‌లో కూడా అతనికి చోటు ఇవ్వనుంది. హృతిక్‌ కి సరైన సినిమా పడితే ఖాన్‌ త్రయాన్ని కూడా దాటేస్తాడు అని అర్ధం అయింది. సల్మాన్ టైం తగ్గడంతో, షారుక్ కనుమరుగు అవుతున్న దశలో, ఆమిర్‌ ఖాన్‌ కూడా సక్సెస్‌ ఫార్ములా మిస్‌ అయిన తరుణంలో హృతిక్‌ పుంజుకోవడంతో అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. ఇకపై కూడా హృతిక్‌ నుంచి ఇటువంటి సినిమాలే రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

 

Tags:    

Similar News