ఇదం జగత్ అందరినీ ఆకట్టుకుంటుంది..!

Update: 2018-08-31 11:55 GMT

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ... సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలిపారు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆడియన్స్‌ ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడని, విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోందని పేర్కొన్నారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

తారాగణం, సాంకేతిక నిపుణులు

శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్

Similar News