సంగీత్ లో చూసి పడిపోయాను!!

బ్యాట్మెంటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలా ఎప్పుడు సంచలనాత్మక విషయాలతో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. అందరూ ఎడ్డెమ్ అంటే తెడ్డెమనే  టైప్ జ్వాలాది. క్రీడల్లో ఆటలో [more]

Update: 2020-05-07 08:52 GMT

బ్యాట్మెంటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలా ఎప్పుడు సంచలనాత్మక విషయాలతో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. అందరూ ఎడ్డెమ్ అంటే తెడ్డెమనే టైప్ జ్వాలాది. క్రీడల్లో ఆటలో అరటిపండులా మిగిలిపోతున్నా అని ఆవేదన చెందిన గుత్తా జ్వాలా ఒకొనొక సమయంలో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే అనుకుంది. అది వరౌట్ అవ్వలేదు. అయితే ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమాయణం నడుపుతుంది. ఆ విషయాన్నీ జ్వాలానే రివీల్ చేసింది. హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్న అని.. త్వరలోనే మా పెళ్లి అంటూ ప్రకటించింది.

అయితే తాజాగా గుత్తా జ్వాలతో విష్ణు విశాల్ పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పాడు. అసలు కరోనా లాక్ డౌన్ తో తన లవర్ విష్ణు ని కలవలేకపోతున్నందుకు బాధపడుతున్న అన్న గుత్తా జ్వాలతో పరిచయంపై విష్ణు విశాల్ తాజాగా నెటిజెన్స్ తో ముచ్చటించాడు. గుత్తా జలతో తన మీ పరిచయం ఎలా ఏర్పడింది అని అడగగా…గుత్తా నాకు హీరో విశాల్ సోదరి సంగీత్ ఫంక్షన్ లో పరిచయం అయ్యింది అని…. అప్పటినుండి తనతో పెరిగిన పరిచయం ప్రేమగా మారినట్లుగా చెబుతున్నాడు. ఇక లాక్ డౌన్ ముగియగానే తమ పెళ్లి అని చెప్పాడు.

Tags:    

Similar News