నేనలా అనలేదంటున్న హీరోయిన్?

హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ లో సక్సెస్ ఉన్నప్పటికీ… ఆమెకి అనుకున్న అవకాశాలు రావడం లేదు. అయితే ప్రతి రోజు పండగే సినిమా తో హిట్ కొట్టిన [more]

Update: 2020-05-01 07:02 GMT

హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ లో సక్సెస్ ఉన్నప్పటికీ… ఆమెకి అనుకున్న అవకాశాలు రావడం లేదు. అయితే ప్రతి రోజు పండగే సినిమా తో హిట్ కొట్టిన రాశి ఖన్నా, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాలో రాశి ఖన్నా కాస్త రొమాంటిక్ గా బోల్డ్ గానే నటించింది. ఆ సినిమా హిట్ అయితే రాశి ఖన్నాకి పేరొచ్చేది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో రాశి ఖన్నా బోల్డ్ పాత్రలో నటించినందుకు ఆమె అభిమానులు హర్ట్ అయ్యారు. ఈలోపు రాశి ఖన్నా ఇంకెప్పుడు అలాంటి బోల్డ్ పాత్రల్లో నటించను అంటూ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా రాశి ఖన్నా వరల్డ్ ఫెమస్ లవర్ లో నటించిన పాత్రలో మరోసారి చెయ్యనని చెప్పినట్టుగా న్యూస్ వచ్చింది. వరల్డ్ ఫెమస్ లవర్ లో ఓ సీన్ లో చేసేటప్పుడు తాను చాలా బాధపడినట్లుగా రాశి ఖన్నా చెప్పినట్టుగా అన్నారు.

అయితే అవకాశాలు లేని రాశి ఖన్నా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే.. ఉన్న అవకాశాలు కూడా ఉడతాయి. అందుకే రాశి ఖన్నా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. తాను ఏ సినిమాలోనూ బాధపడుతూ నటించలేదని, ప్రతి సినిమాని తాను ఆస్వాదిస్తూ నటిస్తా అని, నేను ఇలానే నటిస్తాను అని ఎక్కడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదని… ప్రతి సినిమాని ఒక అందమైన ప్రయాణంగా భావించి నటిస్తా అని చెబుతుంది. 

Tags:    

Similar News