నా టాలెంట్ మీద నాకు నమ్మకముంది!!

మెహ్రీన్ కౌర్ కి కెరీర్ లో హిట్స్ పడిన ఆమె కెరీర్ టర్న్ అయ్యే అవకాశం మాత్రం ఆమెకి రావడం లేదు. అయితే మొన్నామధ్యన నాగ శౌర్య [more]

Update: 2020-06-06 10:45 GMT

మెహ్రీన్ కౌర్ కి కెరీర్ లో హిట్స్ పడిన ఆమె కెరీర్ టర్న్ అయ్యే అవకాశం మాత్రం ఆమెకి రావడం లేదు. అయితే మొన్నామధ్యన నాగ శౌర్య అశ్వద్ధామ నిర్మాతలు మెహ్రీన్ కౌర్ మీద సంచలనంగా మాట్లాడారు. మెహ్రీన్ లాడ్జి ఖర్చు, ఇస్త్రీ బట్టల ఖర్చులు కూడా మా మీదే వేసింది అంటూ మాట్లాడడంతో.. మెహ్రీన్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. నేనేమి అలా చెయ్యలేదని.. మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారంది.

తాజాగా మెహ్రీన్ కౌర్ తన మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ.. తనకి అవకాశాలు రావు అనేది ఒట్టి అపోహ మాత్రమే అని… తనకి అవకాశాలు రావడం గ్యారెంటీ అంటూ మాట్లాడుతుంది. టాలీవుడ్ లో నాపై ఎలాంటి ఆరోపణలు చేసినా నాకు అవకాశాలు రావడం పక్కా.. ఎందుకంటే నా టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది అంటుంది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే తన్నుకొస్తాయనేది మెహ్రీన్ నమ్మకం. మరి మెహ్రీన్ కి ఎఫ్ త్రీ ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు హిట్ పడాలి.

Tags:    

Similar News